టౌన్ లెవెల్ ఫెడరేషన్ అధ్యక్షురాలు వెన్న కవిత, ప్రియదర్శని సంఘ సభ్యురాలు భాగ్యమ్మలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రిసోర్స్ పర్సన్ జిల్లా అధ్యక్షురాలు అన్నెపర్తి రాణి డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం వద్ద రిసోర్స్ పర్సన్స్ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తీసుకున్న పొదుపు సంఘం డబ్బుల నిమిత్తం రీకవరికి వెళ్తే పదేళ్లుగా లెక్కలు చూపించకుండా లేనిపోని నిందలు మోపి తమను తొలగించాలని జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టౌన్ లెవెల్ ఫెడరేషన్ అధ్యక్షురాలు ప్రతి మూడు సంవత్సరాలకు ఒక్కసారి మారాల్సి ఉండగా ఒక్కరే పది సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారని వాపోయారు. అరకొర వేతనాలతో కుటుంబం గడవని పరిస్థితి నెలకొందని అలాంటి మాపై నిందలు మోపి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాళ్ల నుంచి తమకు ప్రాణహాని ఉందని తక్షణమే ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు.
తమపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై తొలగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో తమ సమస్యలు పరిష్కరించాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమళ్ల అన్నపూర్ణకు దరఖాస్తు అందజేశామని గుర్తు చేశారు. వారిపై చర్యలు తీసుకొని పక్షంలో సోమవారం కలెక్టరేట్ నుముట్టడిస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో ఆర్పీలు కోతి పద్మ, కోల మంగ, బీబీ, మంత్రాలపద్మ, గోన విజయమ్మ, కప్పలపద్మ, నూర్జహాన్, రెహనా,లక్ష్మీ ప్రియ, రజినీ, నాగమణి, రాణి, నాగమణి, కట్ట రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.