సూర్యాపేటలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. డిమార్ట్ వెనకాల నిర్మాణంలో ఉన్న భవనంలోకి ప్రవేశించిన భారీ ఎలుగుబంటి స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. ఎలుగు బంటిని రెస్క్యూ చేయడానికి ఐదు గంటలుగా శ్రమించారు ఫారెస్ట్, పోలీసు అధికారులు. రెస్క్యూ ఆపరేషన్ ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.