Saturday, November 23, 2024
HomeతెలంగాణSuryapeta: సూర్యాపేట BJP ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలుస్తా

Suryapeta: సూర్యాపేట BJP ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలుస్తా

ఎంపీటీసీల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బోళ్ళ కరుణాకర్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో జరిగే శాసనసభ ఎన్నికల్లో సూర్యాపేట భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటానని భాజపా రాష్ట్ర నాయకులు, ఎంపీటీసీల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బోళ్ళ కరుణాకర్ అన్నారు. ఆర్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ లో బోళ్ల కరుణాకర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గత 30 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను చైతన్యం చేసేందుకు ప్రజా ఉద్యమాల్లో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలకపాత్ర పోషించినట్లు గుర్తు చేశారు. ఉమ్మడి జిల్లాతో పాటు సూర్యాపేట నియోజకవర్గంలో నాడు ధర్మ విక్షం భీమ్ రెడ్డి నరసింహారెడ్డి ల పోరాటాలతో పాటు నేటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం వరకు ప్రజలతో కలిసి నిత్యం పోరాటాలు చేశామన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో ప్రతి పల్లె పట్టణంలో ప్రతి వార్డులో నెలకొన్న సమస్యలపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ కొంతమంది చేతుల్లోనే బందీ అయిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉవ్వెత్తున ముందు నడిచిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలకు చట్టసభల్లో సరైన సముచిత స్థానం నేటి వరకు దక్కలేదన్నారు. రాజకీయ పార్టీల జెండాలు మోసి గ్రామాల్లో గొడవలు పెట్టుకుని కేసులు పాలు బడుగు బలహీన వర్గాలు అయితే అగ్రవర్ణ నాయకులు చట్టాలు తయారు చేసే కాడ కూర్చుంటున్నారని అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు ఉద్యమకారులు మేధావులు విద్యావంతుల సహకారంతో సూర్యాపేటలో భాజపా అభ్యర్థిగా పార్టీ అధిష్టానం అవకాశం ఇస్తే విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం తెలంగాణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనంతల రామ్ మూర్తి గౌడ్ మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమాలతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కరుణాకర్ ప్రజా ఉద్యమాలు, ఎంపీటీసీల హక్కుల సాధన కోసం గల్లి నుండి ఢిల్లీ వరకు ఉద్యమించి వారి హక్కులను సాధించిన గొప్ప నాయకుడు అన్నారు. నిత్యం అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బోళ్ల కరుణాకర్ కు సూర్యాపేట ప్రజానీకం అండగా నిలిచి రానున్న శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో తుక్కాని మన్మధ రెడ్డి, ఎల్ రాములు, మోదాల విజయ్, పున్న వెంకటేశం, బోళ్ళ శ్రీనివాస్ రెడ్డి, జి కోటయ్య, ప్రజా కవి రామలింగం, సైదా, కరుణాకర్ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News