వినూత్నంగా ఆత్మీయ పలకరింపులు, రాజకీయ సభలకు భిన్నంగా ఆత్మీయ సమ్మేళనం ఇదీ.. సూర్యపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వేంల మండలం బీబీ గూడెంలో ఆవిష్కృతమైన దృశ్యం. ఓ పెండ్లి వేడుక మరో పండుగ,ఇంకో వనవాసం, ఒక జాతర వాతావరణాన్ని మైమరిపించేలా మంత్రి జగదీష్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, నినాదాలు కాకుండా మనవళ్లు, మనువారండ్రతో ఆత్మీయ సమ్మేళనంలో పాలు పంచుకుంది గులాబీ దండు.
సతీమణి సునీతా జగదీష్ రెడ్డి, తనయుడు వేమన్ రెడ్డితో సహా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ కుటుంబసభ్యులతో మధ్యహ్నం వరకు మమేకమయ్యారు. అల్పాహారంతో అట్టహాసంగా ఆత్మీయ సమ్మేళనం ప్రారంభం కాగా, ఆత్మీయ సమ్మేళనంలో కుటుంబ సభ్యులతో సహా హాజరైన బి ఆర్ యస్ శ్రేణులు ఉత్సాహంగా రోజంతా పలు విషయాలపై చర్చలు జరుపుకుని, ముచ్చట పెట్టారు.
కుటుంబ సపరివారంగా సమ్మేళనానికి హాజరైన గులాబీ శ్రేణుల కుటుంబ సభ్యులకు ఆత్మీయ పలకరింపులతో పండుగ వాతావరణ కనిపించింది. మంత్రి జగదీష్ రెడ్డి కుటుంబ సభ్యులతో కుటుంబాల వారిగా ఫోటోలు దిగారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. మూడు యం పి టి సి పరిధిలోని చివ్వేంల, ఐలాపురం,అక్కలదేవి గూడెం, గాయం వారిగూడెం, యం జి నగర్ తాండా, మున్యా నాయక్ తాండా, పాండ్యానాయక్ తండా, రాజు తాండా, రోళ్లబండ తాండా, సూర్యనాయక్ తాండాలతో పాటు వట్టి ఖమ్మం పహాడ్ గ్రామాల నుండి భారీ ఎత్తున తరలి వచ్చిన గులాబీ తాండా వరకూ ఈ సభకు హాజరయ్యారు.