Friday, April 4, 2025
HomeతెలంగాణSuryapeta: గంగమ్మ జాతరలో ఎమ్మెల్యే శానంపూడి

Suryapeta: గంగమ్మ జాతరలో ఎమ్మెల్యే శానంపూడి

యాదవుల ఇలవేల్పు గంగమ్మ తల్లి, పిలిస్తే పలికి, వరాలిచ్ఛే దేవత గంగమ్మ తల్లి

నేరేడుచర్ల మండలంలోని పెంచికల్ దిన్నె గ్రామంలో జరుగుతున్న గంగమ్మ తల్లి జాతరకు హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ యాదవుల కులదైవం ఇలవేల్పు గంగమ్మ తల్లి పిలిస్తే పలికే దైవమని అన్నారు. శ్రద్ధతో కోరితే వరాలు ఇచ్చే దేవతని వివరించారు. చిల్లేపల్లి గంగమ్మ వద్దనే మొదటగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించామని అన్నారు. ఆ తల్లి దీవెనలతోనే అత్యధిక మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఆశీర్వదం పొందానని శానంపూడి గుర్తుచేసుకున్నారు.

అనంతరం పెంచికల్ దిన్నె – సోమారం గ్రామాల మధ్యలో ఊర చెరువు అలుగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News