స్థానిక యువతకు ఐటి హబ్ వరం లాంటిదని అని సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. 200 మందితో ప్రారంభమైన ఐటీ హబ్ ను 5 వేల మందికి విస్తరించడమే లక్ష్యం అని అన్నారు. రాబోయే రోజుల్లో యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సూర్యాపేటలో పారిశ్రామిక హబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాబోయే పారిశ్రామిక హభ్ తో పదివేల మంది స్థానిక యువతకు ఉద్యోగాలలభించనున్నట్లు తెలిపారు. సూర్యాపేటలో ఐటీ హాభ్ సేవలను ప్రారంభించిన మంత్రి, సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఎంపికైన 50 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు నియామక పత్రాలు అందించారు.సూర్యాపేట ఐటి హబ్ ద్వారా ఇంజనీరింగ్ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. టాస్క్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నైపుణ్య తరగతులు నిరుద్యోగ యువతకు వరం లాంటివని
అన్నారు.45 రోజులపాటు నిర్వహించే శిక్షణ తరగతుల్లో బ్యాచ్ 500 మందికి కి చొప్పున శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఈరోజు నుంచి శిక్షణ ప్రారంభం అవుతుందన్న మంత్రి, ప్రతివారు కూడా ఉద్యోగ ఉపాధి పొందేలా ఉద్యోగానికి అవసరమైన శిక్షలను అందించాలని టాస్క్ టీంకు మంత్రి సూచించారు. హైదరాబాద్ కు దీటుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో కూడా ఐటి టవర్ ను ప్రారంభించనున్నామని అదే విధంగా జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా పదివేల మందికి పైగా ఉపాధి అవకాశాలు త్వరలో లభించనున్నాయని ఆయన వెల్లడించారు. ఒకప్పుడు ఉద్యోగ ఉపాధి కోసం హైదరాబాద్ బెంగళూరు వంటి నగరాలకు నిరుద్యోగ యువత ఇతర దేశాలకు కూడా వెళ్లేవారని అయితే అదే స్థాయిలో అలాంటి సౌకర్యాలు ఉద్యోగాలు అన్ని ప్రస్తుతం సూర్యాపేటలోనే లభించడం అందరికీ అవకాశాలు రావడం తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకే సాధ్యమైందని ప్రభుత్వ సహకారంతోనే మరిన్ని అవకాశాలు కూడా వచ్చే విధంగా కొత్త కొత్త కంపెనీలను కూడా ఇక్కడికే తెచ్చి శిక్షణ ఇచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభించేలా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. ఉద్యోగం సాధించాలని తపన పట్టుదల అంకితభావంతో శ్రమించాలని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని ఆయన సూచించారు.
తెలంగాణ సాధించుకున్నాక అన్ని రంగాలలో కూడా యువతను ప్రోత్సహిస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి వివరించారు. కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదని, మరింత పట్టుదలతో ముందుకు పోయి కృషితో నాస్తి దుర్భిక్షం అన్న చందంగా మరింత సక్సెస్ కోసం అహర్నిశలు శ్రమించాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. ఐటీ హబ్ లో అన్ని రకాల శిక్షణలు ఇచ్చి ఉపాధి లభించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో నలగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, టాస్క్ సి ఈ ఓ శ్రీకాంత్ సిన్హా, అదనపు కలెక్టర్ సిహెచ్ ప్రియాంక, ఆర్డీవో వీర బ్రహ్మచారి, తహసిల్దార్ శ్యామ్, రంగారావు, సుందర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి , ఉపాధి కల్పనా అధికారి మాధవరెడ్డి, వివిధ కంపెనీల ప్రతినిధులు , పాల్గొన్నారు.