Saturday, November 23, 2024
HomeతెలంగాణSuryapeta: మంత్రి జగదీష్ వ్యక్తిత్వ వికాస నిపుణుడైన వేళ..

Suryapeta: మంత్రి జగదీష్ వ్యక్తిత్వ వికాస నిపుణుడైన వేళ..

యువత పాజిటివ్ దృక్పథాన్ని అలవర్చుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. తద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించడం సులభమవుతుందని ఆయన యువతకు ఉద్బోధించారు.  యస్ సి స్టడీ సర్కిల్ లో గ్రూప్ 2,3,4 లలో శిక్షణ పొందుతున్న నిరుద్యోగ యువతకు ఆయన ఈ రోజు స్టడీ మెటీరియల్ అందజేశారు. విద్యార్థి యువతలో ఆత్మస్థైర్యం ఇనుమడింప చేసే విధంగా తనదైన శైలిలో ఆయన ప్రత్యేక క్లాస్ తీసుకున్నారు. వ్యక్తిత్వ వికాసం బోధించే నిపుణుడిని మైమరిపించే రీతిలో సాగిన మంత్రి జగదీష్ రెడ్డి ఉపోద్ఘాతం నిరుద్యోగ యువతను మంత్ర ముగ్ధులను చేసింది.  వారిని కట్టి పడేసేలా గంటన్నర సేపు సాగిన ప్రసంగం ఆసాంతం స్వీయ అనుభవాలు, వివిధ రంగాలలో నిష్ణాతులైన వారి చరిత్రను సోదాహరణంగా వివరిస్తుంటే విద్యార్థి యువత అమితాశక్తితో తిలకించారు.  ఉపాధి అంటే ఉద్యోగమే కాదని, ఉద్యోగ ప్రయత్నాలు మంచిదే అని రాకుంటే నిరాశ పడొద్దని ఆయన ఉద్బోధించారు. ఉద్యోగావకాశాలకై ప్రయత్నం చేస్తూనే ప్రత్యమ్నాయ ఉపాధి అవకాశాలను చూసుకోవాలని ఆయన సూచించారు. ఉద్యోగ ప్రయత్నమే జీవితం అనుకోవడం పొరబాటు అవుతుందని ప్రపంచీకరణలో ప్రత్యమ్నాయ ఉపాధి అవకాశాలు మెండుగా విస్తరించాయన్నారు.

- Advertisement -

ఆడి ఓడాలని అంటే ప్రయత్నం చేసి సక్సెస్ అయితే మంచిదని విఫలం అయితే కుంగొద్దు అని ఆయన చెప్పారు. మీ నడవడికనే మీ కుటుంబానికి పేరు, ప్రతిష్టలు తెచ్చిపెడతాయన్న వాస్తవాన్ని విస్మరించకూడదన్నారు. తల్లి తండ్రులు కన్న కలల సాకారానికై విద్యార్థి యువత ఎప్పుడూ సాధన చేస్తునే ఉండాలని విద్యార్థి యువతకు ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్ కుమార్, ఎమ్మార్.పి. ఎస్ రాష్ట్ర నాయకులు చిన శ్రీరాములు, దయానంద తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News