అరకొర వేతనంతో 15 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నామని, ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో సమగ్ర శిశు అభియాన్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్షకు హాజరై రోస్టర్ పాయింట్ ఆధారంగా ఎంపికయ్యామని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే మా జీవితాల్లో మార్పు వస్తుందనుకున్నాం కానీ ఇంతవరకు ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డులు, కనీస వేతనం అమలు కాక వివిధ శాఖలైన సిఆర్పీ, కేజీబీవీ, ఐఆర్పీ, గర్ల్స్ హాస్టల్, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, ఎల్ డి ఏ, టిటిఐ,ఎ ఎన్ ఎం, బోధన, బోధనేతర శాఖలలో జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ శ్రమ దోపిడి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి స్పందించి మా సమస్యలను ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిశు అభియాన్ ఉద్యోగుల సంఘం నాయకులు శ్రీదేవి తేజశ్రీ, ఆర్, వెంకటేశ్వర్లు, జీ రవికుమార్, విజయలక్ష్మి పాల్గొన్నారు.