Thursday, April 3, 2025
HomeతెలంగాణSuryapeta: అందుకే సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ దూరం

Suryapeta: అందుకే సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ దూరం

తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధి ని చూసి ప్రగతి నిరోధకులు తట్టుకులేక పోతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు. నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళసై రాకపోవడం అందులో భాగమేనని ఆయన ఆరోపించారు. సోమవారం రోజున ఆయన సూర్యపేట జిల్లా కేంద్రంలో మీడియా తో మాట్లాడారు.
అభివృద్ధి నిరోధకులు రానంత మాత్రాన ఒరిగే నష్టం ఏమి లేదని ఆయన ఎద్దేవాచేశారు. ప్రారంబోత్సవానికి రావడం, రాక పోవడం అనేది ఆమె విజ్ఞతకే వదిలి పెడు తున్నామన్నారు. గైర్ హాజరుతో గవర్నర్ నిజ స్వరూపం బట్టబయలు అయిందని ఆయన విమర్శించారు. నూతన సచివాలయం తెలంగాణా ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక అని ఆయన అభివర్ణించారు. అటువంటి భవనాన్ని నిర్మించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. మంచిని మంచిగా చూసే గుణం ప్రతిపక్షాలకు ఉండక పోవడం దురదృష్టకరమన్నారు. జరుగుతున్న అభివృద్ధి తో అడ్రెస్ శాస్వతంగా గల్లంతు అవుతుందన్న బెంగ విపక్షాలను వెంటాడుతుందన్నారు. అందుకే అభివృద్ధి కి అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. ఇటువంటి వారికి ప్రజాక్షేత్రం లో గుణపాఠం తప్పదని మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చారించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News