హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో Ficci ఆధ్వర్యంలో రూపొందించిన లాస్ట్ ఇన్ టైం, రివైవింగ్ ద ఫర్గాటెన్ గ్లోరీ ఆఫ్ తెలంగాణ పుస్తకాన్ని ఆవిష్కరించారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ వైభవాన్ని తిరిగి తెర మీదకు తెచ్చిన ఫిక్కిని అభినందించిన మంత్రులు..సామాజిక సేవ, కళా, సాహిత్య, సాంస్కృతిక రంగాలలో ఫికీ సేవలు అమోఘమని కొనియాడారు. Ficci ఆధ్వర్యంలో రూపొందించిన లాస్ట్ ఇన్ టైం, రివైవింగ్ ద ఫర్గాటెన్ గ్లోరీ ఆఫ్ తెలంగాణ అద్భుతంగా వచ్చిందని, టేబుల్ కాపీ బుక్ గా తెలంగాణ చరిత్రను మరో సారి గుర్తు చేసినట్లుగా ఉందన్నారు. తెలంగాణ అద్భుత చారిత్రక సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యాటక, వ్యవసాయక రాష్ట్రమని, తెలంగాణలో గొప్ప వారసత్వ సంపద, చరిత్ర, సంస్కృతి ఇమిడి ఉన్నాయన్నారు. గొప్ప నాగరికతలకు ఆలవాలం తెలంగాణ అన్న మంత్రులు ఇక్కడ పోరాట యోధులు కవులు కళాకారులు ఉద్యమకారులు చరిత్రకారులు ఎందరో ఉన్నారని గుర్తుచేశారు.