అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అని మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని ఆదర్శనగర్ పాతకుంటలో వెలసిన కట్ట మైసమ్మ ఆలయంలో అమావాస్య సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్, ఆలయ ధర్మకర్త వర్త్య విట్టల్ నాయక్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినెల అమావాస్య నాడు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికి తొమ్మిదో నెలగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషమని అన్నారు. ఇట్టి అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా ఆలయం వద్ద భక్తులు ఎవరైనా అన్నదానం నిర్వహించాలనుకుంటే ప్రకాష్, నర్సిములు ని సంప్రదించగలరని అన్నారు.
ఆలయ మార్గంలో సింధు కాలేజీ నుండి బ్రిలియంట్ స్కూల్ వరకు రోడ్డు గురించి భూగర్భల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహకారంతో త్వరలో ప్రారంభిస్తామని అన్నారు. ఆలయనికి విచ్చేసి భక్తుల కోసం పార్కు స్థలం కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ సుధాకర్ , అలంపల్లి ప్రకాష్, నర్సిములు, దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.