Friday, September 20, 2024
HomeతెలంగాణTandur: లారీల కొరత..రోడ్డెక్కిన రైతన్న

Tandur: లారీల కొరత..రోడ్డెక్కిన రైతన్న

నత్త నడకన ధాన్యం కొనుగోలు. కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు అష్ట కష్టాలు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఉపాధ్యక్షులు రమేష్ మహరాజ్ అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ పరిధిలోని ఖంజాపూర్ గేట్ సమీపంలో ఉన్న గోదాంలో రైతులు అమ్మడానికి తెచ్చిన వారి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధార సింగ్, సీనియర్ నాయకుడు పి.జనార్దన్ రెడ్డి రైతులతో పాటు రాస్తారోకో నిర్వహించారు. తాండూరు తహశీల్దార్ చిన్నప్పల నాయుడు, పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చచెప్పడంతో సద్గుమని అయ్యారు.
ఈ సందర్భంగా రమేష్ మహరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే రైతులకు న్యాయం చేయాలని డిమండ్ చేశారు. హైదరాబాద్ రోడ్డు ఖంజాపూర్ గేట్ దగ్గర గోదాంలో వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా తాండూరు నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి రైతులు అమ్మడానికి తెచ్చిన వారి ధాన్యాన్ని సరైన సమయంలో అధికారులు కొనుగోలు చేయకుండా వారిని అష్టకష్టాలు పెడుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజ మేమే కొంటామని గొప్పలు చెప్పడమే కానీ అది ఎక్కడ సరిగా జరగడం లేదని అని అన్నారు. రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మీకు న్యాయం జరిగేంత వరకు మేము ఉంటాము, ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల రైతులకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అని పేర్కొన్నారు. రోజుకు వందల లారీలు, ట్రాక్టర్లు వస్తున్నాయి ఆన్ లోడింగ్ చేసే లేబర్ సరిగా లేక రైతుల స్వయాన దింపుకొని కంట చేయమంటే రేపు మపు అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారాని అన్నారు. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది అని అన్నారు. రైతులు కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు ఇన్ని కష్టాల, రైతులకు ఎలాంటి సౌకర్యాలు లేవు అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అని అన్నారు. ఇక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అయితే సుస్తుగా ఉన్నారు. ఒకరు ఏమో ఇంటి గృహప్రవేశం అని బిజీ బిజీగా ఉన్నారు ఇంకొక్కరు ఏమో ఎమ్మెల్యే టిక్కెట్ నాకే అంటూ బిజీగా ఉన్నారు. మరి రైతుల పరిస్థితి ఏంటి. రైతులకు అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు మరి ఇప్పడు ఈ రైతుల కష్టాలు మీకు కనిపించడం లేదా అని విమర్శించారు. రెండు, మూడు రోజులలో రైతుల దగ్గర కొన్న పంటను తీసుకుని వారికి న్యాయం చేయాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతులతో కలిసి ధర్నా నిర్వహిస్తామని ప్రభుత్వన్ని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News