వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని పూల వ్యాపారులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని పూల వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలని తాండూరు ఫ్లవర్స్ , డెకొరేట్ అధ్యక్షులు సిరాజ్ పాషా కోరారు. తాండూరు పట్టణంలో ఫ్లవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సిరాజ్ పాషా ఆధ్వర్యంలో ఫ్లవర్స్ అసోసియేషన్ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముందు వారి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సిరాజ్ పాషా మాట్లాడుతూ…తాండూరు పట్టణంలోని భద్రప్ప గుడి నుండి గాంధీ చౌక్ కొరకు చిన్న చిన్న టేబుల్ పైన పూల వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని పెరుగుతున్న వాహనదారుల వలన ట్రాఫిక్ సమస్యలు పెరగడంతో పూల వ్యాపారం చేసుకోవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ట్రాఫిక్ సమస్యలతో పూల వ్యాపారులపై విరుచుకుపడుతున్నారని ఇబ్బందులు చేస్తున్నారని వివరించారు. కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యే దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు.
వీలైనంత తొందరగా పుల వ్యాపారం చేసుకోవడానికి రైతు బజార్ దగ్గర స్థలం కేటాయించాలని కోరారు. దీంతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ…గతంలో కూడా పూల వ్యాపారుల సమస్యలు తమ దృష్టికి తెచ్చారని, త్వరలో రైతు బజార్ దగ్గర పూల వ్యాపారుల కోసం స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పూల వ్యాపారుల అసోసియేషన్ అధ్యక్షులు సిరాజ్ పాషా, సభ్యులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి పూలమాలలతో, శాలువాలతో ఘనంగా సన్మానించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ మజీద్, జాయింట్ సెక్రెటరీ షేక్ ఆరిఫ్, ట్రీసుర్ సయ్యద్ సలీం, సభ్యులు రాజు, కృష్ణ , శ్రీనివాస్, రషీద్, ఖలీల్ ,ఆరిఫ్ ,అఫ్రోజ్, తదితరులు పాల్గొన్నారు.