Friday, November 22, 2024
HomeతెలంగాణTandur: ఐటీ దాడులకు భయపడ-రోహిత్ రెడ్డి

Tandur: ఐటీ దాడులకు భయపడ-రోహిత్ రెడ్డి

బెదర.. తగ్గేదే లే

కాంగ్రెస్ తాటాకు చప్పులకు భయపడేదే లేదని తాండూరు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఫిర్యాద్దుతోనే నాకు సంబంధించిన, నా స్నేహితుల ఇళ్ల పైన ఐటీ దాడులు జరిగాయి, ఐటీ దాడులకు భయపడేది లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రలతో తాండూరు ప్రజలలో ఎలాంటి ఆదరణ లభించలేదు. కర్ణాటక రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారు అనేది ఆలోచించి తాండూర్ ప్రజలు మీ ఓటును వృధా చేసుకోవద్దని తెలిపారు.
తాండూరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ 269 బూతులలో కనీసం 50 బూతులలో జండా పట్టే కార్యకర్తలు కూడా లేరని, తాండూరు ప్రజలు యువత మొత్తం బిఆర్ఎస్ వైపే ఉన్నారని అన్నారు. ప్రజలకు నాపై పూర్తి నమ్మకం, ప్రేమ, ఆదరణ ఉంది. గత 5 సంవత్సరాల నుండి తాండూరు ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి పనులు చేస్తున్నానని అన్నారు. తాండూరు అభివృద్ధికి అడ్డుకట్ట వేసింది కాంగ్రెస్. బిఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని గడపంటూ లేదని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ చేసుకోవాల్సిందే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ నేతలపై, రైతులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కొంతమంది దొంగలు వ్యక్తిగతంగా నాపై నాయకులపై దిగజారుడు రాజకీయ కుట్రలు చేస్తున్నారని, ఎన్ని కుట్రలు చేసిన భయపడేది లేదు, అదిరేది లేదు, తగ్గేదే లేదని అన్నారు. కాంగ్రెస్ నాయకులు తాండూర్ ప్రజలను మోసం చేస్తూ, మభ్య పెడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో బ్రాహ్మండమైన ఆదరణ ఉందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. డిసెంబర్ 3 వ తేదీన భారీ మెజారిటీ తో మీ తాండూర్ బిడ్డనైన నేను భారీ మెజారిటీతో గెలుస్తున్న, మూడో సారి సీఎం కెసిఆర్ హ్యాట్ట్రిక్ సీఎం అవుతున్నారని తెలిపారు. తాండూరులో జరిగిన ఐటీ అధికారులు దాడులు వాస్తమే, అయితే తన ఇంట్లో దాడులు జరిగాయని వచ్చిన పుకార్లు ఆవాస్తవమని తెలిపారు. తాండూరు పట్టణంలోని దుర్గా గ్రాండియర్ రెస్టారెంట్ లో ఉంటున్న స్నేహితుని వద్ద, తనకు సంబంధించిన వ్యక్తుల వద్ద 14 చోట్ల విచారణ జరిగిందని వివరణ ఇచ్చారు. తన స్నేహితుని వద్ద అతని వ్యాపారానికి సంబంధించిన సుమారు రూ.25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసిందని స్పష్టం చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, నాయకులు సిద్రాల శ్రీనివాస్. కోహిర్ శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, అనంతయ్య ముదిరాజ్, రవీందర్ రెడ్డి, వడ్డె రాములు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News