Monday, July 8, 2024
HomeతెలంగాణTandur: ఎమ్మెల్యే పైలెట్..హైలెట్ గా నిలిచాడు

Tandur: ఎమ్మెల్యే పైలెట్..హైలెట్ గా నిలిచాడు

తాండూరులో రోహిత్ రెడ్డికి తిరుగులేదు

తాండూరు అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది అంటే పైలెట్ రోహిత్ రెడ్డి వలనే, అదేవిధంగా తాండూరు ప్రజల్లో ఎమ్మెల్యే పైలెట్ కి మంచి ఆదరణ ఉందని నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పైలెట్ రోహిత్ రెడ్డిని ప్రకటించారని బిఆర్ఎస్ యువ నాయకులు నిరంజన్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాదులోని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వీరు మాట్లాడుతూ… తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా రోహిత్ రెడ్డిని రెండవసారి ఎంపిక చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాండూరు ఈరోజు ఇంత అభివృద్ధి చెందింది అంటే అది ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వల్లనే. తాండూరు పట్టణ మరియు నియోజకవర్గంలో ఇప్పడు అభివృద్ధి చూస్తున్నాం అంటే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చొరవ వల్లనే జరుగుతుందని అన్నారు. తాండూరు ముద్దుబిడ్డ రోహిత్ రెడ్డికి తిరుగులేదు వచ్చే ఎన్నికల్లో అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం అని తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో నిరంజన్ గౌడ్, మహేష్ రెడ్డి, రాథోడ్ రమేష్, చంటి, సికిందర్, అమర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News