రథసారథుల రాకతో తాండూరులో గులాబీ జెండాలు రెపరేపలాడాయి. వికారాబాద్ జిల్లా తాండూరు తాండూరు పట్టణంలో భూగర్భ, గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి పదవి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా తాండూర్ కు విచ్చేసిన సందర్భంగా తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాండూరు పట్టణంలోని విలియమున్ చౌరస్తా నుండి రైల్వే స్టేషన్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. అభిమానులు వీరికి గజమాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి కేసీఆర్ రోహిత్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, నాకు రెండోవ సారి మంత్రి పదవి ఇచ్చి తాండూరు ప్రాంతానికి సేవ చేసే మంచి అవకాశం వచ్చింది. భారీ మెజారిటీతో తాండూరు నుంచి రోహిత్ రెడ్డిని గెలిపిస్తానని హామీ ఇచ్చామన్నారు. తాండూరు ప్రజలకు అందుబాటులో ఉండి ఎల్లవేళల సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఎంపి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ…. నాలుగు సంవత్సరాల నుంచి నా లక్ష్యం రోహిత్ రెడ్డి మహేందర్ రెడ్డి ఇద్దరి కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆశ అది ఈరోజు తీరిందన్నారు. వీరిద్దరి కలయికతో అపోసిషన్ వారికి గుబులు మోదలైయింది. తాండూరులో ఈ సారి బ్యాలెట్ బాక్స్ లు మోతమోగిపోవాలి, గులాబీ జెండా ఎగరాలని అన్నారు.
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం సంతోషకరమైన విషయం అని బంపర్ మెజారిటీతో నన్ను గెలిపించాలని కేసీఆర్ కోరికను నెరవేర్చాలని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తాండూరుకు త్వరలో మరిన్ని నిధులు తీసుకువచ్చి తాండూర్ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. చంద్రయాన్ 3 లాగానే ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మూడవసారి ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.