Friday, September 20, 2024
HomeతెలంగాణTandur: ఎన్నికల బరిలో రజనీకాంత్

Tandur: ఎన్నికల బరిలో రజనీకాంత్

స్థానికంగా చురుకైన నేతగా ప్రఖ్యాతిగాంచిన నేత

తాండూరు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో అసెంబ్లీ కన్వీనర్ రజినీకాంత్ దరఖాస్తు చేశారు. తక్కువ సమయంలో ప్రజల్లో మంచి ఆదరణ సంపాదించి, హిందూ ధర్మం కోసం పోరాటం చేసి తనదైన శైలిలో దూసుకెళ్తున్నా రజినీకాంత్ తాండూరు స్థానానికి దరఖాస్తు చేయడంతో ప్రజలు ఈసారి తాండూరు బీజేపీలో ఊహించని విదంగా మార్పు కనిపించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు తాండూరు అసెంబ్లీ స్థానానికి బీజేపీ నుంచి అభ్యర్థుల సంఖ్య పెరిగింది. హిందూ సంస్కృతిక కార్యక్రమాలు తాండూర్ నియోజకవర్గంలోని ఏ మండలంలో చేసిన రజనీకాంత్ వందల మంది యువకులతో వెళ్లి హిందూ ఉత్సవ కమిటీ సభ్యులతో ఏకమై హిందూ కమిటీ కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించి హిందూ ఐక్యతను చాటిచూపి కార్యక్రమాలను ఘనవిజయంగా చేసి చూపించిన ఘనత రజనీకాంత్ కి దక్కింది. బిజెపి బూత్ కమిటీ కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాలు ఏర్పాటు చేసిన సమయంలో రజనీకాంత్ స్థానిక యువకులతో మమేకమై బిజెపి బలోపేతానికి కృషి చేశారు. అధిష్టానం రజనీకాంత్ కు ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ కేటాయిస్తే తాండూరు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు హిందూ సభ కమిటీ అధ్యక్షులు సభ్యులు యువకులు మమేకమై బంపర్ మెజారిటీతో రజనీకాంత్ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తారని సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News