Sunday, October 6, 2024
HomeతెలంగాణTandur: ఎమ్మెల్యే పైలెట్ చల్లగా ఉండాలి

Tandur: ఎమ్మెల్యే పైలెట్ చల్లగా ఉండాలి

పల్లె పల్లెల్లో ప్రత్యేక ప్రార్థన

బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రతి గ్రామాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసినారు తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో సురక్షితంగా బయటపడ్డారు. ఈ నేపథ్యంలో చర్చిలలో ఆయన అభిమానులు, మద్దతుదారులు పెద్దసంఖ్యలో పూజలు నిర్వహించారు. టెంకాయలు 51 నుండి 101 వరకు సమర్పిస్తూ ముక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తాండూరు అభివృద్ధి కొరకే నీవు పుట్టినావు, దేవుడు నిన్ను చల్లగా చూడాలని గ్రామ గ్రామాన యువ నాయకులు టిఆర్ఎస్ నాయకులు గ్రామ కమిటీ అధ్యక్షులు అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. ఆ భగవంతుడు నిన్ను సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.

- Advertisement -

కోర్విచెడ్ గ్రామంలో అధ్యక్షులు రాజు పిఎసిఎస్ డైరెక్టర్ నవీన్ రెడ్డి సమక్షంలో నిర్వహించారు. అదేవిధంగా జీవన్గి గ్రామంలో ఏఎంసి డైరెక్టర్ పాండు సౌకారి భార్యాభర్తలు రామలింగేశ్వర ఆలయంలో చండీయాగం చేశారు 36 గ్రామ పంచాయతీల సర్పంచులు ఎంపిటిసిలు సీనియర్ నాయకులు పాల్గొని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మనసున్న మహారాజును దేవుడు చల్లగా ఉండాలని దేవుళ్లకు ప్రత్యేక ప్రార్థన చేశారు. జీవన్గి గ్రామ కమిటీ అధ్యక్షులు సోమశేఖర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భీమిరెడ్డి, బసప్ప కోర్విచెడ్, అంబేద్కర్ యువజన సంఘ ప్రెసిడెంట్ యాదయ్య , మారుతి , శానప్ప, మాజీ సర్పంచ్ హనుమప్ప, తిరుపతి , బోయిని శామప్ప, ఏసప్ప, మొగులప్ప పలు గ్రామ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News