వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జిన్గుర్తి గ్రామంలో గురువారం రోజు ఊరడమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. డోలు డప్పులు వాయిద్యాల మధ్య అమ్మవారికి గ్రామ మహిళలు 249 బోనాలతో ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేకంగా పిండి వంటలతో నైవేద్యాని సమర్పించారు. జాతర మహోత్సవంలో పోతురాజు విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఏర్పుల సానీ భవిష్యవాణి వినిపించింది. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఊరడమ్మ మహోత్సవాలు చేయాలని భవిష్యవాణిలో ఆమె తెలిపారు.