Sunday, October 6, 2024
HomeతెలంగాణTandur: సంబరాల పేర సొమ్ము వృథా

Tandur: సంబరాల పేర సొమ్ము వృథా

సొంత లాభం కోసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కొట్లాట

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ నిధులు వెచ్చిస్తూ పార్టీ ప్రచార కార్యక్రమాలు చేపట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది దగా రావణ వధ కార్యక్రమాన్ని తాండూరు పట్టణంలోని అంబేద్కర్ కూడలి దగ్గర నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసిసి సభ్యులు రమేష్ మహారాజ్ మాట్లాడుతూ…గత తొమ్మిది సంవత్సరాలుగా కేసీఆర్ తాండూర్ కి ఒక పెద్ద ప్రాజెక్టు ఏది చేయకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మెడికల్ కాలేజ్ గాని నర్సింగ్ కాలేజ్ గాని కంది బోర్డే గాని ఇండస్ట్రియల్ పార్క్ గాని ఏదీ కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపారని, స్థానిక ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ ప్రతిరోజు తన పదవులు తమ ఆస్తి సంపాదన సొంత లాభం కోసమే కష్టపడుతున్నారు తప్ప తాండూర్ కి ఒక్క రూపాయి లాభం వచ్చే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. వారి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని రాష్ట్రంలో ఏదన్న వివాదమైన కేసు ఉంటే అది తాండూర్ దే అన్నట్టు విధంగా ఇద్దరు ఉండటం చాలా దురదృష్టకరం వీరిద్దరూ తమ పదవులు కాపాడుకోవడానికి ఎమ్మెల్యే పదవిని ఎమ్మెల్సీ పదవిని వాడుకుంటున్నారు తప్ప తాండూరు ప్రజల బాగోగులకు ఒక్క క్షణం కూడా ఆలోచించే తీరిక లేదని కావున తాండూరు ప్రజలు ఇప్పటికైనా సమయం మించిపోలేదు రెండు మూడు మాసాలలో తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల రాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి జరగాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే అటు కర్ణాటక రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేసే విధంగా రైతు రుణమాఫీ ఉచిత బస్సు వరంగల్ లో రైతు డిక్లరేషన్ మొన్న హైదరాబాద్ లో జరిగిన యూత్ డిక్లరేషన్ తూచా తప్పకుండా అమలు చేస్తుందని రైతులకు కర్షకులకు కార్మికులకు నిరుద్యోగులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓటు వేసి గెలిపించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దముల్, యాలాల్, బషీరాబాద్, తాండూర్ రూరల్ తాండూర్ పట్టణం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, తాండూరు టౌన్ మహిళా కౌన్సిలర్లు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News