Friday, September 20, 2024
HomeతెలంగాణTandur: వీరశైవులకు అండగా ఉంటాం

Tandur: వీరశైవులకు అండగా ఉంటాం

వీరశైవ సమాజము నూతన కార్యవర్గం

వీరశైవ సమాజం అభివృద్ధికి కృషి చేస్తామని ప్రజా ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు సహకరించాలని గౌరవాధ్యక్షులు వాలి శాంతు కుమార్ వెల్లడించారు. వీరశైవ సమాజము నూతన కార్యవర్గ, పదవీ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని వీరశైవ మండపంలో ఆదివారం నిర్వహించిన 2023 – 25 వీరశైవ సమాజం నూతన కార్యవర్గ పదవి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మహేందర్ రెడ్డి, శాసనసభ్యులు రోహిత్ రెడ్డి, రాష్ట్ర బిసి కమిషన్ మెంబెర్ శుభ ప్రద్ పటేల్ హాజరై నూతనంగా ఎన్నుకున్న గౌరవ అధ్యక్షులు వాలి శాంత్ కుమార్, అధ్యక్షులు ఆర్. బస్వరాజ్, ఉపాధ్యక్షులు భద్రప్ప, కార్యదర్శి లింగదల్లి రవికుమార్, సహాయ కార్యదర్శి ఆబులం సంపత్ కుమార్, కోశాధికారి వాలి శ్రావణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్, ఘనపూర్ శంకర్, గాజుల శాంత కుమార్, పరమేశ్వర స్వామి, శెట్టి భాస్కర్, చంద్రశేఖర్, శ్రావణ్ కుమార్, పటేల్ శ్రీశైలం, గౌరీ శంకర్ లకు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు, అధ్యక్షులు మాట్లాడుతూ… వీరశైవ సమాజానికి అన్నివేళలా ముందుండి అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. సమాజం సభ్యులలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా తక్షణమే స్పందించి సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిలైన మఠం నీలకంఠ స్వామి, చంద్రశేఖర్ కిరణ్ స్వామి సభ అధ్యక్షులు పటేల్ శ్రీశైలం, జిల్లా వైస్ చైర్ పర్సన్ బైండ్ల విజయకుమార్, అఖిలభారత వీరశైవ సమాజ అధ్యక్షులు నేతి మహేష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న, వై చైర్ పర్సన్ దీప, భాగివి భద్రేశ్వర దేవాలయ రెనోవేషన్ కమిటీ చైర్మన్ సుధాకర్, ఎంపీటీసీ ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్ లావణ్య, యువ అధ్యక్షులు అభిషేక్, ఎన్నికల అధికారి నారాయణ, వక్తలు సిద్ధి లింగయ్య జొన్నల బసవరాజ్ మరియు కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్, గణపురం శంకర్, గాజుల శాంతికుమార్, గులి పరమేశ్వర్, శెట్టి భాస్కర్,తంబాకు చంద్రశేఖర్, గంగ శ్రావణ్ కుమార్,పటేల్ శ్రీశైలం, గౌరీ శంకర్, వీరశైవ మహిళా మండలి ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News