Saturday, November 23, 2024
HomeతెలంగాణTandur: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

Tandur: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

మనోధైర్యంతో ఎదగండి

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణంలోని వైట్ ప్యాలెస్ లో మైనారిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్, మెహందీ డిజైన్ల శిక్షణ పొందిన మహిళలకు జీఎంకె చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మొహమ్మద్ ముజీబ్ పటేల్, జనరల్ సెక్రటరీ బషీద్ వారి ట్రస్ట్ ద్వారా మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ముఖ్య అతిధులుగా జిల్లా జడ్పి ఛైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై వీరి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మహిళలు కుట్టు మిషన్ నేర్చుకోవడం వలన స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని, మనోధైర్యతో జీవితంలో ఎదగ వచ్చని అన్నారు. అనంతరం చారిటబుల్ ట్రస్ట్ వారికి లబ్ధిదారులు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, స్థానిక కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, మైనారిటీ వెల్ఫేర్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News