Sunday, July 7, 2024
HomeతెలంగాణTanduru: భక్తులతో కిటకిటలాడిన భూకైలాస్

Tanduru: భక్తులతో కిటకిటలాడిన భూకైలాస్

హరహర మహాదేవ.. శంభో శంకరా.. ఓం నమ్ణశివాయ అంటూ శివ నామస్మరణతో తాండూరు ప్రాంతం పులకించిపోయింది. భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని ప్రధాన ఆలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. తెలవారుతుండగానే ఆలయాలకు చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి.

- Advertisement -

అంతారం తండాలోని భూకైలాస్ ఆలయంలో ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. శివునికి మహాప్రీతిపాత్రమైన మహాశివరాత్రి రోజున బిల్వార్చకం, రుద్రాభిషేకాలతో ఆ ముక్కంటి సేవలో తరిస్తున్నారు. ఆలయంలో ప్రత్యకంగా ఏర్పాటు చేసిన 9 శక్తిపీఠాలు అమ్మవార్లు, ఆత్మలింగం, నవగ్రహాలు, శనీశ్వర స్వామి విగ్రహా ప్రతిష్టాపన వేదపండితుల ఆధ్వర్యంలో హోమాలు నిర్వహిస్తూ మహా శివునికి అభిషేకాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలకు ప్రత్యేక పూ జలు నిర్వహించి ప్రతిష్టాపన కార్యక్ర మాలు చేపట్టారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు, అధికారులు ఏర్పాట్లు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News