Sunday, October 6, 2024
HomeతెలంగాణTanduru: ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Tanduru: ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తాండూరు పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గులాబీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. తాండూరు ఎమ్మల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని 8వ వార్డులో ఆవిర్భావ దినోత్స‌వాన్ని పురస్కరించుకొని వార్డు ఇంచార్జి జావిద్, కౌన్సిలర్ వెంకన్న గౌడ్ స్థానిక నాయకులతో కలిసి బీ ఆర్ ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వార్డు ఇంచార్జి జావిద్, కౌన్సిలర్ వెంకన్న గౌడ్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా జరగని అభివృద్ధి పనులు కేవలం నేడు బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే తాండూరు పట్టణం తో పాటు గ్రామాలు, తండాల రూపు రేఖలు మారుతున్నాయని అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సాయిప్ప, ఫయాజ్, షౌఖత్, బాబా సాహెబ్, షరీఫ్, మహేష్ రెడ్డి, పింటు సుందర్, అబ్బు, ముస్తాఫ్ఫా, నిరంజన్, వాజీద్, మహిళలు సువర్ణ, బిల్కిస్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News