వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేదే లేదని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. తాండూరు మండలం బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మురళీకృష్ణ గౌడ్ నోరు పారేసుకోవడం సమంజసం కాదన్నారు. ఎమ్మెల్యే బిక్ష తోటే జిల్లా గ్రంథాలయం చైర్మన్ అయిన విషయాన్ని మురళీ గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించారు.
ఎమ్మెల్యే వెంబడి ఉండి వ్యక్తిగతంగా ఆర్థికంగా ఎదగడానికి ఎన్నో పనులు చేశారని, ఎమ్మెల్యే తాండూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక కొందరితో చేతులు కలిపి పిచ్చిగా మాట్లాడడం మంచిది కాదని వారన్నారు.
మురళి కృష్ణ గౌడ్ పై చర్యలు తీసుకోవాలని కరణ్ కోట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మళ్లీ ఇలాంటి చర్యలు పునరావృతం కారాదని బీఆర్ఎస్ నేతలన్నారు.