Monday, July 8, 2024
HomeతెలంగాణTanduru: ఎమ్మెల్యే టిక్కెట్ నాకే "నో డౌట్"

Tanduru: ఎమ్మెల్యే టిక్కెట్ నాకే “నో డౌట్”

ఎమ్మెల్యే టిక్కెట్ నాకే “నో డౌట్” అని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.  ఈమేరకు ఆయన కోటరీ విస్తృతంగా వ్యూహాత్మక ప్రచారం మొదలు పెట్టినట్టు పరిస్థితులు ఉన్నాయి. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్యనేతలతో చైర్పర్సన్ నివాసంలో భేటి అయిన ఆయన.. ఈ విషయంపై ఎవరు ఎలాంటి అపోహలు పెటుకోవద్దని తెలియజేసినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో పట్నం మహేందర్ రెడ్డికే టిక్కెట్ అనే పోస్టులు వైరల్ గా మారాయి. మరోపక్క పట్నం అభిమానులు తాండూరు అంటేనే మహేందర్ రెడ్డి, తాండూరు అడ్డా మహేందర్ రెడ్డి అడ్డా అని జోష్ మీద ఉన్నారు. 

- Advertisement -

మరోవైపు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వర్గీయులు ఎమ్మెల్యే టిక్కెట్ మా రోహిత్ రెడ్డికే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.  ఈ పోటాపోటీ ప్రచారం మధ్య అసలు స్థానికంగా ఎవరికి బీఆర్ఎస్ అవకాశం ఇస్తుందన్నది పజిల్ గా ఆసక్తి రేకెత్తిస్తోంది.  తాండూరు నుంచి ఎవరు ఎమ్మెల్యేగా గెలిచిన ఒరిగేదేమీ లేదని, తాండూర్ అభివృద్ధికి కృషి చేస్తామని అనడం తప్ప చేసిందేమీ లేదని ఇంకోవైపు సామాన్యులు ఈసడించుకుంటున్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజం. హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న తాండూరు రాజకీయాలు రోజురోజుకీ రంజుగా మారుతుండటమే కాదు.. పట్నం వర్సెస్ పైలట్ రేసు చాలా ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News