తాండూరులో కాంగ్రెస్ విజయభేరి యాత్ర విజయవంతం. తాండూరు పట్టణంలో విజయభేరి యాత్రకు ముఖ్య అతిథులుగా టీపీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, డీసీసీ అధ్యక్షులు రాంమోహన్ రెడ్డితో పాటు ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి 10వేల మందితో విలయమూన్ చౌరస్తా నుండి ఇందిరా చౌక్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఇందిరా చౌక్ లో ఏర్పాటు చేసిన సభలో డీకే శివకుమార్ మాట్లాడుతూ… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కర్ణాటక రాష్ట్రంకి వచ్చి 5 గ్యారెంటీ పథకాలు ఏ వవిధంగా అమలు అవుతున్నాయో లేదో తెలుసుకోవాలని అన్నారు. కర్ణాటకలో గృహ జ్యోతి పథకం కింద ఉచితంగా 200 యూనిట్ల కరెంటు ఇస్తున్నాం, మహా లక్ష్మి పథకం ద్వారా నెలకు రూ. 2500 ఇస్తున్నాం, 10కిలోల ఉచిత సన్న బియ్యం ఇస్తున్నాం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. టీపీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రసంగించారు… ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు పేద ప్రజలకు అందడం లేదు, ప్రజలకు మభ్యపెట్టి మోసపూరితమైన హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ ఇక దుకాణం బంద్ చేసుకోవాలి అధికారంలోకి కాంగ్రెస్ వస్తుందని అన్నారు. జిల్లాలోని నాలుగు స్థానాలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది… తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డిని బంపర్ మెజారిటీతో గెలిపించాలని తాండూర్ నియోజకవర్గం ప్రజలకు సూచించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పైలెట్ రోహిత్ రెడ్డిని నియోజకవర్గ ప్రజలు నమ్మి గెలిపిస్తే ప్రజలను మోసం చేసి బిఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయాడు. ఈసారి అలాంటి వ్యక్తులను ఓటు వేసి మరొకసారి మోసపోకండి అని ప్రజలకు సభాముఖంగా తెలియజేశారు. కాంగ్రెస్ గెలుపు ఖాయం, అధికారంలోకి వచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.