Thursday, September 19, 2024
HomeతెలంగాణTanduru: ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు

Tanduru: ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు

క్యాన్సర్ ప్రాణాంతకమే అయినా నివారించే వ్యాధని ప్రతి ఒక్కరూ గుర్తించాలని బాలాజీ హాస్పిటల్ అధినేత డా. సంపత్ కుమార్, కల్వ సుధాకర్ అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. బివిజి ఫౌండేషన్, ఏంఎన్జే కాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్, ఆర్య వైశ్య సంఘం తాండూరు వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. తొలి దశలోనే గుర్తించి, క్యాన్సర్ అని నిర్ధారించుకున్న తర్వాత తగిన వైద్యం పొందగలిగితే క్యాన్సర్ నుంచి బయటపడగలమని వైద్యులు వివరించారు.

- Advertisement -

క్యాన్సర్ ప్రధానంగా గర్భసంచి, రొమ్ము, నోటి క్యాన్సర్ వంటి మూడు భాగాలకు సోకుతుందని, తొలి దశలో గుర్తించి క్యాన్సర్ అని నిర్ధారణ చేసుకున్న తర్వాత తప్పనిసరిగా వైద్యం పొందాలన్నారు. క్యాన్సర్ పై అపోహలు పెట్టుకోరాదని మొహమాట పడకుండా ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యాలాల్ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, కల్వ సుధాకర్, మురళి, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News