Friday, September 20, 2024
HomeతెలంగాణTanduru: హెల్మెట్‌ భారం కాదు.. భరోసా

Tanduru: హెల్మెట్‌ భారం కాదు.. భరోసా

దేశవ్యాప్తంగా ప్రతిరోజు జరిగే రోడ్డు ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు. ఎక్కువగా వాహనదారుల నిర్లక్ష్యం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో బైక్ ప్రమాదాలే ఎక్కువగా ఉన్నాయి అని తాండూరు పట్టణ ఎస్ఐ అబ్దుల్ రౌఫ్ అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులు ప్రతిఒక్కరు హెల్మెట్ ధరించాలని అవగాహన కార్యక్రమం నిర్వహించి పట్టణ ఎస్ఐ మాట్లాడుతూ ద్విచక్రవాహనంపై వెళ్లే వారికి హెల్మెట్ లేకపోవడం వల్ల నిత్యం చాలామంది మరణిస్తున్నారు. హెల్మెట్ ప్రాముఖ్యత గురించి ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ చాలా మంది ఇప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారి కుటుంబాలను విషాదంలో మునిగేలా చేస్తున్నారు. ఇప్పటికైనా హెల్మెట్ ధరించండి సురక్షితంగా ఉండాలని వాహనదారులకు సూచించారు. ద్విచక్ర వాహనదారులు సాధారణంగా చేసే తప్పుల గురించి చెప్పి హెల్మెట్ ప్రాముఖ్యత గురించి వివరించారు.

- Advertisement -

రాజ్యాంగంలో మనకు ఏడు ప్రాథమిక హక్కులుంటే. మనం హక్కులను కొన్ని సొంతంగా రాసుకున్నాం.

  1. పాల ప్యాకెట్‌కు రోడ్డు చివరి వరకేగా వెళ్లేది హెల్మెట్ అవసరం లేదు.
  2. పార్టీలకు డబ్బు ఖర్చు పెడతాం కానీ, తక్కువ ధరకు హెల్మెట్ కొనాలి.
  3. జుట్టు ఊడిపోతుంది కావున హెల్మెట్ పెట్టుకోకూడదు.
  4. హెల్మెట్ కొనుకోవాలి కానీ, బండి ట్యాంకు మీద పెట్టి స్టైలిగ్‌గా ఉంచాలి. తలకు పెట్టుకోకూడదు.
  5. పోలీసులు లేరు కావున హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
  6. మనం హెల్మెట్ కొనుక్కుంటే చాలు. పిల్లలకు అవసరం లేదు.
  7. హెల్మెట్ పెట్టుకోవాలంటూ ఎవరైనా చెబితే వాడంత మూర్ఖుడు ఎవరూ లేరు. ఇదండి మన సమాజం అంటూ సందేశంలో పేర్కొంటారు. ఇలాంటివి పక్కకు పెట్టి. ఇప్పటికైనా ద్విచక్ర వాహనం నడపాలంటే హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని ఎస్ఐ అబ్దుల్ రౌఫ్ ప్రజలకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాండూరు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News