‘గల్లీగల్లీకి పైలెట్’ కార్యక్రమంలో భాగంగా తాండూరు మున్సిపల్ పరిధిలోని 36వ వార్డులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పర్యటించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ నరుకుల సింధుజ నరేందర్ గౌడ్ ఎమ్మెల్యేని గజామాలతో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఒకప్పటి తాండూరు.. ఇప్పుడు తాండూరు ఎలా ఉందో తాండూరు ప్రజలు గమనించాలి. గత పాలకులు తాండూరు అభివృద్ధి చేసేందుకు నిర్లక్ష్యం వహించారు. గత నలబై ఏళ్లుగా ఏ నాయకులు చేయని అభివృద్ధిని నాలుగేళ్లలో నేను చేసి చూపించిన. వార్డుకు కోటి రూపాయలతో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అదేవిధంగా 36వ వార్డులో దాదాపు 90 శాతం పనులు పూర్తి అయ్యాయని అన్నారు.
ఇంకా ఏమైనా అరకొర పనులు ఉంటే మరిన్ని నిధులు తీసుకొచ్చి డెవలప్ చేసే సత్తా నాకుందన్నారు. రోడ్ల నిర్మాణాలు పూర్తి చేసి , తాండూరు రూపురేఖలు మర్చి చూపిస్తా అన్నారు. ప్రతిపక్షాలకు అదిరేది లేదు..బెదిరేది లేదు ..తగ్గేదేలేదు అన్నారు. ఈ సందర్భంగా నరుకుల సింధుజ గౌడ్ మాట్లాడుతూ నా వార్డు ఈరోజు ఇంత అభివృద్ధి చెందింది అంటే అది ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వల్లనే. తాండూరు పట్టణ మరియు నియోజకవర్గంలో ఇప్పడు అభివృద్ధి చూస్తున్నాం అంటే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చొరవ వల్లనే జరుగుతుంది. అదేవిధంగా వార్డులో కొన్ని సమస్యలు ఉన్నాయి అని అడిగిన వెంటనే.. ఎమ్మెల్యే సరే అంటూ వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక వార్డు కౌన్సిలర్, వార్డు ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్, పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు, వార్డు కౌన్సిలర్లు నరుకుల సింధుజ నరేందర్ గౌడ్, వెంకన్న గౌడ్, సంగీత ఠాకూర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, యువనేతలు, కార్యకర్తలు, వార్డు మహిళలు తదితరులు పాల్గొన్నారు.