Saturday, April 12, 2025
HomeతెలంగాణTanduru: ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి

Tanduru: ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి

ఆడపిల్ల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళా చైతన్య మూర్తి, సామాజిక ఉద్యమకారిణి, సంఘకర్త, భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు శ్రీమతి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా తాండూరులోని పీపుల్స్ డిగ్రీ కళాశాలలో ఘనంగా నివాళి అర్పించారు.
జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు, తాండూర్ నియోజవర్గ బిసి సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు.

- Advertisement -

ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ ఆధునిక భారత ధ్రువతార సావిత్రిబాయి పూలే అన్నారు. ఆడపిల్లలు ముఖ్యంగా బహుజన బిడ్డలు చదువుకోవాలని తద్వారా మహిళల్లో చైతన్యం కలుగుతుందని భావించి స్త్రీల విద్య కోసం నిరంతరం శ్రమించిన మహిళా చైతన్య మూర్తి సావిత్రిబాయి పూలే అన్నారు.

ఈ కార్యక్రమంలో పీపుల్స్ కాలేజ్ ప్రిన్సిపల్ సత్యానంద కుమార్, ఉపాధ్యాయులు , విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News