Monday, April 7, 2025
HomeతెలంగాణTanduru: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం

Tanduru: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఏమాత్రం అభివృద్ధి చెందడం లేదని గ్రామాలలో అభివృద్ధి శూన్యమని, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేవలం సొంత లాభం  కోసం అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఏఐసీసీ మెంబర్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు తాండూర్ ఇంఛార్జి యం. రమేష్ మహారాజ్ అన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రను వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని 33వ వార్డులో ర్ మధుబాల భీమ్ శంకర్, కాంగ్రెస్ నాయకులతో కలిసి నిర్వహించారు.

- Advertisement -

హాత్‌ సే హాత్‌ జోడో యాత్రతో ప్రజల కు మరింత చేరువై కాంగ్రెస్‌ పార్టీని అధికారంలో తీసుకొస్తామన్నారు. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల వైఫల్యాలను చార్జ్‌షీట్‌ల రూపంలో ప్రతీ గడపకు చేరవేసి, ప్రజల్లో విశ్వాసం కల్పిస్తామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News