Saturday, November 15, 2025
HomeతెలంగాణTeenmaar Mallanna: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ

Teenmaar Mallanna: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ

Teenmaar Mallanna New Party Announce: తెలంగాణలో కొత్త పార్టీ ఆవిర్భవించింది. బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ కొత్త పార్టీ స్థాపించారు. తన పార్టీకి ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ (టీఆర్‌పీ) అనే పేరును ఖరారు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణా హోటల్‌లో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో ప్రకటించారు. ఆయన పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించి ప్రజల ముందుకు తెచ్చారు. బీసీల ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండాగా ఈ పార్టీని స్థాపిస్తున్నట్లు తీన్మార్‌ మల్లన్న స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డ మీద బీసీలు తమకు తాముగా ఒక రాజకీయ పార్టీని తీసుకొస్తున్నామని, బీసీల ఆత్మగౌరవ జెండా రేపటి నుంచి రెపరెపలాడబోతోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

- Advertisement -

పార్టీ జెండా.. అజెండా ఇదే..

పార్టీ జెండాను ఎరుపు, ఆకుపచ్చ రంగులో తీసుకొచ్చారు. జెండా మధ్యలో పడికిలి బిగించిన చేయితో పాటు కార్మిక చక్రం, వరి కంకులతో జెండా రూపొందించారు. జెండా పై భాగంలో ఆత్మ గౌరవం, అధికారం, వాటా అనే నినాదాలను పేర్కొన్నారు. అదే విధంగా పిడికిలి కింది భాగంలో పార్టీ పేరును తెలంగాణ రాజ్యాధికార పార్టీగా పేర్కొన్నారు. బీసీ మేధావి నారగోని చేతుల మీదుగా పార్టీ జెండా ఆవిష్కరించారు. ఆకుపచ్చ రంగు అంటే రైతులు, ఎర్ర రంగు అంటే పోరాటం అని ఈ సందర్భంగా మల్లన్న వివరించారు. డిజైనర్ రాజేశం పార్టీ జెండాను రూపొందించినట్లు తెలిపారు. తాజ్ కృష్ణ హోటల్‌లో జరిగిన పార్టీ ఆవిష్కార సభకు బీసీలు, వివిధ కుల సంఘాల నేతలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. బీసీల రాజ్యాధికారం కోసం కలిసి రావాలని ఈ సందర్భంగా తీన్మార్‌ మల్లన్న పిలుపునిచ్చారు. తెలంగాణలో 90 శాతం ఉన్న బీసీల రాజ్యాధికారం కోసం.. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం ఈ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు.

Also Read: https://teluguprabha.net/cinema-news/akkineni-nagarjuna-announces-milestone-film-king-100/

అసెంబ్లీ మెట్లు ఎక్కని కులాల కోసమే..

తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి బీఫాం లు అడుక్కునే పరిస్థితి ఈ రోజు నుంచి ముగిసిందని తీన్మార్‌ మల్లన్న అన్నారు. సెప్టెంబర్ 17కు ఎంతో గొప్ప చరిత్ర ఉందని.. పెరియార్ జయంతి, విశ్వ కర్మ జయంతి అయిన ఈ రోజున బీసీల తలరాత మరే రోజుగా పార్టీ ప్రకటిస్తున్నట్లు చెప్పారు. పార్టీ అంటే పాన్ డబ్బా కాదు అని గతంలో విమర్శించారని.. కానీ బీసీల హక్కులు, రాజ్యాధికారం కోసం పార్టీ పెడుతున్నానని ఈ సందర్భంగా మల్లన్న అన్నారు. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత తాను ప్రజలకు ఏమీ చేయలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఈ సందర్భంగా అన్నారు. బీసీల కోసం పోరాటం చేసేందుకే ఎమ్మెల్సీగా కొనసాగుతున్నానని తెలిపారు. అసెంబ్లీ మెట్లు ఎక్కని కులాలను అసెంబ్లీ లో కూర్చునేలా చేస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad