ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna)కు బిగ్ షాక్ తగిలింది. ఆయనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈమేరకు పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఫిబ్రవరి 5న పార్టీ షోకాజ్ నోటీసు పంపింది. అయితే ఎలాంటి వివరణ రాకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇటీవల బీసీ సభలో రెడ్డి సామాజికవర్గంపై మల్లన్న తీవ్ర విమర్శలు చేశారు. అలాగే కులగణనలో బీసీలను తక్కువ చేసి చూపించారంటూ కులగణన నివేదికను తగలబెట్టారు. దీంతో ఈ పరిణామాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ తాజాగా ఆయనపై సస్పెండ్ వేటు వేసింది. కాగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నూతన ఇంఛార్జ్‌గా ఎన్నికైన మీనాక్షి నటరాజన్ హైదరాబాద్‌కు రాగానే తీన్మార్ మల్లన్నపై వేటు పడటం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. అలాగే శుక్రవారం గాంధీభవన్ లో జరిగిన పార్టీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కొంతమంది పార్టీ నేతలు అదుపుతప్పి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
