రాష్ట్రంలో రెండవ విడత గొర్రెల పంపిణీకి సర్వం సిద్ధమైంది. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర షీప్స్&గోట్స్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ డా.దూదిమట్ల బాలరాజు యాదవ్ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మార్గద్శకత్వంలో మూడు లక్షల యాబై గొఱ్ఱెల యూనిట్లను పంపిణీ చెయ్యడం కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ గొఱ్ఱెల, మేకల అభివృద్ది సంస్థ చైర్మన్ డా.దూదిమట్ల బాలరాజు యాదవ్ తెలిపారు.
మసబ్ టాంక్ లోని తెలంగాణ గొఱ్ఱెల మరియు మేకల ” డెవలప్మెంట్ ఫెడరేషన్ కార్పొరేషన్ రాష్ట్ర కార్యాలయం లో సంస్థ ఎండి, ముఖ్య అధికారుల సమావేశం నిర్వహించారు. సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాలలోని కలెక్టర్ల అధ్వర్యంలో గొఱ్ఱెల పంపిణీ జరుగుతుందని, 32 జిల్లాలో గొఱ్ఱెల యూనిట్ల రవాణా సరఫరా కోసం టెండర్ల పక్రియ కొనసాగుతుందని ” మూడు లక్షల యాబై వేల యూనిట్లకు కావాల్సిన డెభై మూడు లక్షల యాభై వేయ్యల పంపిణీ చేసే గొర్రెలను అధికారులు సమావేశంలో గుర్తించామని తెలిపారు”.
జిల్లా అధికారుల నేతృత్వంలో లబ్దిదారుల
డి డి చెల్లింపులు, సర్టిఫికెట్స్ సేకరణ, లబ్దిదారుల అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని వారు తెలిపారు. జిల్లాల వారీగా లబ్దిదారుల సంఖ్యను మరియు లబ్దిదారుల వివరాలను E-LAB పోర్టల్ లో పొందుపరచాలని ” అధికారులను ఆదేశించారు. 6100 కోట్ల రూపాయల నిధుల కేటాయింపుతో రెండవ విడుత గొఱ్ఱెల పంపిణీ జరుతుందని ‘ తెలిపారు. రెండవ గొఱ్ఱెల పంపిణీకి శ్రీకారం చుట్టిన సీఎం గౌరవ శ్రీ కెసిఆర్ యాదవ కురుమ ప్రజల తారుపున తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండీ రామచంద్రం, డి.డి శ్రీనివాస్ రావు, ఏ.డి వెంకటయ్య గౌడ్, డా. సాయిరాజ్ తదితరులు పాల్గొన్నారు.