తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈనెల 30వ తేదీ ఉదయం 10 గంటలకు శాసనసభ సమావేశం జరగనుంది. సంతాప దినాల్లో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు(Manmohan Singh) సభ నివాళులు అర్పించనుంది. ఈమేరకు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు ఎమ్మెల్యేలకు సమాచారం అందించారు.