త్వరలో తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections)కు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. రెండు టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ప్రకటించారు.
నల్గొండ-ఖమ్మం-వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డి(వరంగల్), కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్య(పెద్దపల్లి), కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ అభ్యర్థిగా అంజిరెడ్డి(సంగారెడ్డి)ని ఎంపిక చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. మరోవైపు 12 జిల్లాల నుంచి ఓటు హక్కు కోసం మొత్తం 28వేల మందికి పైగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు దరఖాస్తు చేసుకోగా.. 22,554 మంది ఓటర్లతో ముసాయిదా ఓటర్ల జాబితాను ఫైనల్ చేశారు.