Saturday, July 12, 2025
HomeతెలంగాణRamchander Rao: నా కంటే ఫైర్ బ్రాండ్ ఎవరూ లేరు.. రాంచందర్ రావు హాట్ కామెంట్స్

Ramchander Rao: నా కంటే ఫైర్ బ్రాండ్ ఎవరూ లేరు.. రాంచందర్ రావు హాట్ కామెంట్స్

Ramchander Rao Counter Attack: తనను డమ్మీ లీడర్ అంటూ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలపై తెలంగాణ రాష్ట్ర నూతన బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను డమ్మీ లీడర్‌నా.. కాదా..? త్వరలోనే చూపిస్తా అని హెచ్చరించారు. తన ఉగ్రరూపం చూపిస్తే తట్టుకోలేరు అని వ్యాఖ్యానించారు. మావోయిస్టులతో పోరాటం చేశారని.. 14 సార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చానని పేర్కొన్నారు. తనను డమ్మీ అన్నవాళ్లకు డాడీ అవుతా అని తెలిపారు. సిద్ధాంతాల మీద పోరాటం చేసే సత్తా తనకు ఉందన్నారు. తెలంగాణలో తన కంటే ఫైర్ బ్రాండ్ ఎవరు లేరన్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.

- Advertisement -

రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది కిరీటం కాదని.. బాధ్యత అని చెప్పుకొచ్చారు. తమకు కాంగ్రెస్ పార్టీతోనే పోటీ అని.. బీఆర్ఎస్ పార్టీతో కాదన్నారు. బీఆర్ఎస్ అనేది కేవలం ట్విటర్ పార్టీ అని ఎద్దేవా చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించడమే తన తదుపరి లక్ష్యమన్నారు. పార్టీలో అందరినీ కలుపుకుపోవాలనే ఉద్దేశంతోనే కూల్‌గా ఉంటున్నానని వెల్లడించారు. తన ఉగ్రరూపం చూస్తే తట్టుకోలేరు అని వార్నింగ్ ఇచ్చారు. చొక్కా గుండీలు విప్పి బూతులు మాట్లాడితేనే అగ్రెసివ్ లీడర్ కాదన్నారు. ప్రస్తుతం బీజేపీలో ఎలాంటి విభేదాలు లేవని.. అందరం కలిసిగట్టుగానే పనిచేస్తాని వివరించారు. రాజాసింగ్ రాజీనామా అంశం జాతీయ నాయకత్వం చూసుకుంటుందన్నారు.

కాగా రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎంపికైన రాంచందర్ రావు ఇన్నోసెంట్ నాయకుడని విమర్శలు వస్తున్నాయి. ఆయన గట్టిగా కొట్లాడలేరంటూ కామెంట్స్ వినిపించాయి. ఈ విమర్శలకు తనదైన శైలిలో ఆయన కౌంటర్ ఇచ్చారు. రాంచందర్ రావు విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆర్ఎస్ఎస్‌లో పనిచేశారు. అనంతరం బీజేపీలో చేరారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. ఎమ్మెల్యే, ఎంపీగా కూడా పోటీ చేశారు. ఎవరూ ఊహించిన పార్టీనే నమ్ముకున్న ఉన్న రాంచందర్ రావుకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను బీజేపీ పెద్దలు అప్పగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News