Monday, July 14, 2025
HomeతెలంగాణPrakash Raj: ప్రకాష్ రాజ్‌కు తెలంగాణ బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్

Prakash Raj: ప్రకాష్ రాజ్‌కు తెలంగాణ బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్

సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj)కు తెలంగాణ బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆయనను బురదలో పందితో పొలుస్తూ పోస్ట్ షేర్ చేసింది. ఇటీవల తన నరనరాల్లో దేశభక్తి ప్రవహిస్తుందని ప్రధాని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ప్రధాని నరనరాల్లో ఉండేది దేశభక్తి కాదని.. ఆయన నరనరాల్లో ప్రవహించేది ఎన్నికలేనని ఓ పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్టుపై బీజేపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ ఘాటుగా స్పందించింది.

- Advertisement -

ప్రకాష్‌ రాజ్ నటించిన ఒక్కడు సినిమాలోని ఓ సన్నివేశంలో బురదలో పడే దృశ్యాన్ని, పందితో జోడించి.. ‘రెండూ ఒకటే’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా కొంతకాలంగా బీజేపీ, ప్రధాని మోదీపై ప్రకాష్ రాజ్ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News