2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది తెలంగాణ సర్కారు. ఎన్నికల ఏడాది కావటంతో పలు రంగాలపై భారీగా నిధులను పెంచి, ప్రజలను ఉత్సాహపరిచే ప్రయత్నం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. వైద్యారోగ్య శాఖకు 12,161 కోట్ల బడ్జెట్ కేటాయించిన ఆర్థిక మంత్రి హరీష్ రావు.. అన్ని జిల్లాలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ విస్తరణ, రూ.200 కోట్లు కేటాయింపు.. 4 లక్షల మంది గర్భిణులకు ప్రయోజనం కలిగేలా బడ్జెట్ లో కేటాయింపులు చేశారు. ప్రతి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు, కొత్తగా మరో 100 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్టు బడ్జెట్ లో పేర్కొన్నారు.