రూ.3.04లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్(Telangana Budget)లో ముఖ్యమైన ఆరు గ్యారంటీలకు రూ.56,084 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అభయహస్తం పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరు గ్యారంటీల హామీలను ప్రజలకు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ బడ్జెట్‌లో పెద్ద ఎత్తున గ్యారంటీల అమలుకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క నిధులు మంజూరు చేశారు.
ఆరు గ్యారంటీలకు కేటాయింపులు ఇలా..
రైతు భరోసా – రూ.18,000 కోట్లు
చేయూత పింఛన్లు – రూ.14,861 కోట్లు
ఇందిరమ్మ ఇళ్లు – రూ.12,571 కోట్లు
మహాలక్ష్మి(ఉచిత బస్సు ప్రయాణం)- రూ.4,305 కోట్లు
గృహజ్యోతి (200 యూనిట్ల ఉచిత విద్యుత్)- రూ.2,080 కోట్లు
సన్నాలకు బోనస్ – రూ.1,800 కోట్లు
రాజీవ్ ఆరోగ్యశ్రీ – రూ.1,143 కోట్లు
గ్యాస్ సిలిండర్ రాయితీ – రూ.723 కోట్లు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా – రూ.600 కోట్లు
విద్యుత్ రాయితీ – రూ.11,500 కోట్లు
రాజీవ్ యువ వికాసం- రూ.6000 కోట్లు