రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్(TG Assembly Budget) సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు శాసనసభలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు పోలీసులు అనుమతులు నిరాకరించారు.
మరోవైపు ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయా శాఖలకు సంబంధించి బడ్జెట్‌లో కేటాయింపులపై ప్రతిపాదనలు సమర్పించారు. ఈనెల 19 లేదా 20న భట్టి విక్రమార్క 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి రూ.3.20 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాగా గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.