Sunday, November 16, 2025
HomeతెలంగాణTG Cabinet: SC వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం

TG Cabinet: SC వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం

ఎస్సీ వర్గీకరణ(SC Classification) ముసాయిదా బిల్లుకు తెలంగాణ మంత్రివర్గం(Telangana Cabinet) ఆమోదం తెలిపింది. న్యాయపరమైన చిక్కులు లేకుండా తుది మెరుగులు దిద్దాలని మంత్రులు, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు.

- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ కొనసాగుతోంది. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను పెంచే బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహణ, ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లుపైనా చర్చించనున్నారు. టూరిజం పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ఇక యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డుకు సంబంధించి ఎండోమెంట్‌ సవరణ బిల్లును కూడా ఆమోదించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad