సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో కేబినెట్ సమావేశం(Cabinet Meeting) ప్రారంభమైంది. ఆర్ధిక మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) బడ్జెట్‌ను మంత్రివర్గంలో ప్రతిపాదించారు. ఈ సందర్భంగా బడ్జెట్‌పై మంత్రుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. తన శాఖకు కొంచెం ఎక్కువ నిధులు కేటాయించాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. అందుకు మీ శాఖ అంతా AIనే కదా అంటూ భట్టి చమత్కరించారు.
- Advertisement -
కేబినెట్ ఆమోదం అనంతరం బడ్జెట్‌ను భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో విపక్షాలతో పాటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.