Sunday, November 16, 2025
HomeతెలంగాణTelangana Cabinet: కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక బిల్లులకు ఆమోదం తెలిపే ఛాన్స్

Telangana Cabinet: కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక బిల్లులకు ఆమోదం తెలిపే ఛాన్స్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం(Telangana Cabinet) కాసేపట్లో సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో కేబినెట్ భేటీ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టం(ROR) బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ఇద్దరికి మించి పిల్లలు ఉన్న వారు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించేలా పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు ప్రతిపాదించనున్నారు. అలాగే రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సులపై చర్చించి విధివిధానాలను ఖరారు చేయనున్నారు.

- Advertisement -

ఇక యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై జస్టిస్ మదన్ బీ లోకూర్ కమిషన్ సమర్పించిన విచారణ నివేదికను కూడా కేబినెట్‌లో చర్చించనున్నారు. అనంతరం అనంతరం ఈ బిల్లులను శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మరోవైపు ఫార్ములా– ఈ రేసింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి కేటిఆర్‌(KTR)పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ అనుమతించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad