Sunday, November 16, 2025
HomeTop StoriesCM Revanth Reddy: పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ దిల్లీ పర్యటన.. దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ!

CM Revanth Reddy: పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ దిల్లీ పర్యటన.. దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ!

CM Revanth Reddy Delhi Tour: తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీలో పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇందుకోసం ఆయన గురువారం సాయంత్రమే దిల్లీ చేరుకున్నారు. ఈ రోజు ఓ ప్రముఖ హోటల్‌లో వివిధ రంగాల దిగ్గజ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహించనున్నారు.

- Advertisement -

ముఖ్యమంత్రి పర్యటన వివరాలు:

న్యూజెర్సీ గవర్నర్‌తో సమావేశం: శుక్రవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ పార్ట్‌నర్ స్టేట్ లాంజ్‌లో పీఏఎఫ్‌ఐ ఆధ్వర్యంలో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి. మర్ఫీతో ద్వైపాక్షిక సమావేశంలో సీఎం పాల్గొంటారు. ఈ సందర్భంగా రెండు ప్రాంతాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చించనున్నారు.

వార్షిక ఫోరంలో ప్రసంగం: దేశ రాజధానిలో జరుగుతున్న పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (పీఏఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న 12వ వార్షిక సదస్సులో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. శుక్రవారం ఉదయం 11:30 గంటలకు జరిగే 12వ వార్షిక ఫోరంలో 500 మంది ప్రతినిధులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలను ఈ వేదికపై వివరిస్తారు. ఈ సదస్సులో ఆయన “విజన్ తెలంగాణ – తెలంగాణ రైజింగ్” అనే అంశంపై ప్రసంగించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పెట్టుబడులకు గల అవకాశాలు, ప్రభుత్వ విధానాలను ఈ వేదికపై వివరిస్తారు. ఈ సమావేశం ద్వారా దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు వాణిజ్య ప్రతినిధులతో సంభాషించి రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు సీఎం కృషి చేయనున్నారు.

Also Read:https://teluguprabha.net/telangana-news/police-vacancy-details-submitted-to-telangana-govt-job-calendar-soon/

బహుళ జాతి సంస్థలతో చర్చలు: మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, కార్ల్స్‌బర్గ్, గోద్రెజ్, ఉబర్ వంటి ప్రసిద్ధ బహుళ జాతి సంస్థల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలపై వారితో చర్చిస్తారు.

వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడితో భేటీ: అనంతరం.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు, సీఈఓ బోర్గే బ్రెండేతో ముఖ్యమంత్రి ముఖాముఖి సమావేశం అవుతారు. రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య అవకాశాలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించేందుకు ఈ సమావేశం కీలకంగా భావిస్తున్నారు. ఈ సమావేశాలు తెలంగాణ ఆర్థికాభివృద్ధికి మరియు పెట్టుబడులను ఆకర్షించడానికి ఎంతగానో తోడ్పడతాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad