Saturday, November 15, 2025
HomeతెలంగాణTelangana: మంత్రుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్.. అధిష్టానానికి అందజేసిన సీఎం!

Telangana: మంత్రుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్.. అధిష్టానానికి అందజేసిన సీఎం!

Ministers progress report: తెలంగాణ రాజకీయాలు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. మామూలుగా అయితే అధికార, ప్రతిపక్షాల మధ్య నువ్వా నేనా.. అన్నట్టుగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం సర్వ సాధారణం. కానీ.. తెలంగాణలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా.. మంత్రులే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే.. అంతర్గత విభేదాలతో రేవంత్ సర్కార్ ఆగం ఆగం అవుతుంది. పాలనను పక్కదోవ పట్టించేలా మంత్రుల తీరు ఉండడంతో హైకమాండ్ సైతం.. రేవంత్ పాలనపై తీవ్ర నిరాశతో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో మంత్రుల పనితీరుపై విడివిడిగా నివేదికలను సిద్ధం చేయాలని అధిష్టానం.. సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్టుగా తెలుస్తోంది. అందుకే ఒక్కో మంత్రి పనితీరుపై విడివిడిగా నివేదికను సిద్ధం చేసి.. దిల్లీ కాంగ్రెస్ పెద్దలకు రేవంత్ రెడ్డి అప్పగించినట్టు సమాచారం.

- Advertisement -

అవినీతి ఆరోపణలపైనే ప్రధాన దృష్టి: మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి నివేదికి సిద్ధం చేసి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. తాజా దీల్లీ పర్యటనలోనే సీఎం ఈ రిపోర్టును కాంగ్రెస్ పెద్దలకు ఇచ్చినట్టు సమాచారం. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు సదరు మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలు, వారు సృష్టించిన వివాదాలను ప్రధానంగా ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకుని జిల్లాల్లో కొనసాగిస్తున్న దందాలను సైతం అందులో పేర్కొనట్టుగా.. రేవంత్ రెడ్డి అనుచరుల ద్వారా తెలుస్తోంది. నిజానికి ప్రతినెలా మంత్రుల పనితీరుపై పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో పాటు, దిల్లీ పెద్దలకు సైతం రిపోర్టు పంపిస్తుంటారు. కానీ ఈ మధ్య కొందరు మంత్రుల వ్యవహారం అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారడంతో మంత్రులపై పూర్తిస్థాయి నివేదికను హైకమాండ్‌కు పంపినట్టు ప్రచారం జరుగుతుంది.

Also Read:https://teluguprabha.net/telangana-news/parents-sale-a-girl-childin-nalgonda-district-telangana/

నివేదికలో ప్రధాన అంశాలు ఇవే: అంతర్గతంగా ఉండాల్సిన మంత్రుల విభేదాలు.. ఇటీవల బహిర్గతం కావడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మంత్రుల హోదాలో ప్రజల సమస్యలపై దృష్టి పేట్టాల్సిందిపోయి.. కాంట్రక్టులపై దృష్టి పెట్టడం లాంటి అంశాలు నివేదికలో పొందుపరిచినట్టుగా సమాచారం. వివాదాలు, అవినీతి ఆరోపణలనేప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిసింది. అలాగే మంత్రులు తమకు కేటాయించిన శాఖల్లో ఏ మేరకు పురోగతి తీసుకొచ్చారనే అంశాలను చేర్చారు. అంతే కాకుండా ఆ శాఖలోని సమస్యలను ఏ విధంగా పరిష్కరించారు.. ప్రజలతో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనే అంశాలను సైతం వివరించినట్టుగా తెలుస్తోంది. సచివాలయంలో మంత్రులను కలిసే గెస్టులు ఎవరు? మంత్రుల ఇంటికి వెళ్లే అతిథులు ఎవరూ.. వీకెండ్‌లో మంత్రులు ఎక్కడ ఉంటున్నారు లాంటి అనేక అంశాలను సైతం నివేదికలో చేర్చినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad