Friday, January 16, 2026
HomeతెలంగాణTelangana: రేవంత్‌ సర్కార్‌ సంక్రాంతి కానుక: ఈ నెల 12న రెండు కొత్త పథకాలు ప్రారంభం!

Telangana: రేవంత్‌ సర్కార్‌ సంక్రాంతి కానుక: ఈ నెల 12న రెండు కొత్త పథకాలు ప్రారంభం!

CM Revanth Reddy: రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగ వేళ రాష్ట్ర ప్రజలకు తీపి కబురు అందించింది. సమాజంలోని అణగారిన వర్గాలు, వృద్ధులు మరియు చిన్నారుల సంక్షేమమే ధ్యేయంగా రెండు సరికొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. జనవరి 12న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాలను స్వయంగా ప్రారంభించనున్నారు.

- Advertisement -

వృద్ధుల కోసం ప్రణామం పథకం: దివ్యాంగులు మరియు వృద్ధుల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు ‘ప్రణామం’ పథకాన్ని ప్రభుత్వం రూపొందించింది. దివ్యాంగులకు రూ.50 కోట్ల కేటాయింపు: దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రాథమికంగా రూ.50 కోట్లు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 7 వేల మంది లబ్ధిదారులకు అవసరమైన పరికరాలను పంపిణీ చేయనున్నారు. వినికిడి యంత్రాలు, వీల్ చైర్లు, బ్యాటరీ ట్రై సైకిళ్లు, రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలను అందించనున్నారు. అంతేకాకుండా విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు, ఉపాధి పొందే యువతకు ఆధునిక సాంకేతికతను అందించేలా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేయనున్నారు.

Also read-KTR: కేటీఆర్‌కు ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ నుండి ఆహ్వానం

వృద్దుల కోసం కేర్ సెంటర్లు: వృద్ధుల ఒంటరితనాన్ని పోగొట్టి వారికి అండగా నిలిచేందుకు ప్రతి జిల్లాలో రెండు చొప్పున డే-కేర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో సెంటర్ కోసం రూ.12.48 లక్షలు వెచ్చించనున్నారు. ఇక్కడ వృద్ధులకు ఉచితంగా పోషకాహారం, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, టీవీ మరియు ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పిస్తారు.

చిన్నారుల ఆరోగ్యం బాల భరోసా పథకం: భావి భారత పౌరులైన చిన్నారుల ఆరోగ్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి పరిష్కరించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. దీని ద్వారా ఐదేళ్లలోపు చిన్నారుల్లో ఉండే శారీరక, మానసిక లోపాలను అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గుర్తిస్తారు. పరీక్షల్లో ఏదైనా సమస్య ఉన్నట్లు తేలితే వారికి అవసరమైన ఫిజియోథెరపీతో పాటుగా అత్యున్నత స్థాయి శస్త్రచికిత్సలను ప్రభుత్వమే ఉచితంగా చేయిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News