Saturday, November 15, 2025
HomeతెలంగాణColleges Strike : ఈనెల 15 నుంచి తెలంగాణలో విద్యా సంస్థల బంద్.. ఉన్నత విద్యాసంస్థల...

Colleges Strike : ఈనెల 15 నుంచి తెలంగాణలో విద్యా సంస్థల బంద్.. ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య హెచ్చరిక

Colleges Strike : ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలోని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఈనెల 15 నుంచి కళాశాలలను నిరవధికంగా బంద్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సమాఖ్య సభ్యులు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డిని కలిసి తమ నిర్ణయాన్ని స్పష్టం చేశారు. బకాయిలు విడుదల చేసే వరకు బంద్‌ను కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. ఈ ఆందోళన వల్ల రాష్ట్రంలోని దాదాపు పది లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

- Advertisement -

సమాఖ్య సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.10 వేల కోట్లకు పైగా పేరుకుపోయాయి. దీంతో కళాశాలల నిర్వహణ, అధ్యాపకుల వేతనాలు, ఇతర మౌలిక వసతుల కల్పన తీవ్ర సమస్యగా మారింది. ఈ పరిస్థితిని పరిష్కరించేందుకు, ఇప్పటికే టోకెన్లు విడుదల చేసిన రూ.1,200 కోట్లనైనా ఈనెల 30వ తేదీ లోగా విడుదల చేయాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ బంద్‌ను మరింత తీవ్రం చేస్తూ, మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజినీర్స్ డేగా జరుపుకునే సెప్టెంబర్ 15వ తేదీని ‘బ్లాక్ డే’గా ప్రకటించాయి. ఆ రోజున ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, ఎంబీఏ, ఎంసీఏ వంటి అన్ని వృత్తి విద్యా కళాశాలలు బంద్ పాటించనున్నాయి. డిగ్రీ, పీజీ కళాశాలలు సెప్టెంబర్ 16 నుంచి బంద్లో పాల్గొంటాయని సమాఖ్య తెలిపింది. విద్యార్థులు, అధ్యాపకులు, కళాశాలల యాజమాన్యాల మధ్య ఈ బంద్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని విద్యావేత్తలు కోరుతున్నారు. లేనిపక్షంలో ఉన్నత విద్యారంగం మరింత సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad