Revanth Reddy :తెలంగాణలో త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పార్టీ గెలుపును నిర్ధారించుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి, ఎన్నికల వ్యూహాలపై సమీక్ష నిర్వహించారు. ఈ రోజు జరిగిన కీలక సమావేశంలో నియోజకవర్గంలోని డివిజన్ల ఇన్‌ఛార్జులు, స్థానిక నేతలతో ఆయన భేటీ అయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల గెలుపు కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త కలిసికట్టుగా, సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలందరికీ వివరించాలని, బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలని సూచించారు. “నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తామనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించాలి. అభ్యర్థి ఎవరనేది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) నిర్ణయిస్తుంది. అయితే, అభ్యర్థి ఎవరైనా పార్టీని గెలిపించే బాధ్యత మీ అందరిపై ఉంది” అని ఆయన స్పష్టం చేశారు.
Jagan’s Dilemma: పంతమా.. పదవా? జగన్ ముందు పెను సవాల్! అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యే పదవి గల్లంతే!
ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా సమీక్ష నిర్వహించడంతో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. ఈ కీలక ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను మరింత ఆసక్తికరంగా మార్చా


